Telangana High Court: ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడం నేరం కాదు.. తెలంగాణ హైకోర్టు

Telangana High Court says failing to marry after love is not a crime
షార్ట్స్‌లో చూడండి
ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ తర్వాత నిరాకరించడం మోసం కిందకు రాదని, అది నేరం కాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రేమ విఫలమైనంత మాత్రాన దాన్ని నేరంగా పరిగణించలేమని, సంబంధం ప్రారంభంలోనే మోసం చేయాలనే దురుద్దేశం ఉన్నట్లు ఆధారాలు ఉంటేనే అది సంబంధిత సెక్షన్ల కిందకు వస్తుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఓ యువకుడిపై నమోదైన మోసం కేసును కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించింది.

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లాకు చెందిన కె.సంతోష్ అనే యువకుడు తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి 2022లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి ప్రస్తావన తేగా సంతోష్ నిరాకరించాడని ఆరోపించింది. దీనిపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ సంతోష్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్.తుకారాంజీ ఇరుపక్షాల వాదనలు విన్నారు. ఐదేళ్ల పాటు సత్సంబంధాలు కొనసాగిన తర్వాత పెళ్లికి నిరాకరించడాన్ని, ప్రారంభంలోనే మోసపూరిత ఉద్దేశంతో చేసిన వాగ్దానంగా పరిగణించలేమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఇది కేవలం పెళ్లి వాగ్దానాన్ని ఉల్లంఘించడం మాత్రమేనని, మోసం కాదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ఉటంకించారు. ఇలాంటి కేసును కొనసాగించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని వ్యాఖ్యానిస్తూ, సంతోష్‌పై నమోదైన కేసును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Go Back to Shorts
Telangana High Court
Love marriage
Failed love
Cheating case
Justice N Tukaramji
Supreme Court
Pettapalli district
Love affair
Breach of promise
K Santosh

More Telugu News