Azad: దొంగతనం అనుమానం.. ఏడేళ్ల బాలుడిని 5 గంటలు ఫ్రీజర్‌లో నిర్బంధించిన యజమాని.. వీడియో ఇదిగో!

Uttar Pradesh Shopkeeper Azad Arrested for Locking Boy in Freezer
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలుడిని ఓ దుకాణదారుడు సుమారు ఐదు గంటల పాటు ఫ్రీజర్‌లో బంధించాడు. తన దుకాణంలో ఆహారం దొంగిలించాడనే ఆరోపణతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

హాపుర్ జిల్లాకు చెందిన ఆజాద్ తన దుకాణంలో దొంగతనం చేశాడనే అనుమానంతో ఏడేళ్ల బాలుడిని పట్టుకుని, అతడిని ఫ్రీజర్‌లో బంధించాడు. వైరల్ అయిన వీడియోలో నిందితుడు బాలుడిని బయటకు తీసి "మళ్లీ దొంగతనం చేస్తావా? నా సహనాన్ని పరీక్షిస్తున్నావు" అంటూ దూషించాడు. కత్తితో గొంతు కోస్తానని బెదిరించడం కూడా ఆ వీడియోలో వినిపించింది. తీవ్ర భయాందోళనలకు గురైన ఆ బాలుడు, తాను ఏ తప్పు చేయలేదని ఏడుస్తూ ప్రాధేయపడటం కనిపించింది.

తన కుమారుడు గంటల తరబడి ఏడ్చాడని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి తండ్రి డిమాండ్ చేశారు. వీడియో వైరల్ కావడంతో తాము వెంటనే స్పందించామని పోలీసులు తెలిపారు. నిందితుడు ఆజాద్‌ను అరెస్టు చేసి, ఈ కేసులో చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Go Back to Shorts
Azad
Uttar Pradesh
Hapur
child abuse
freezer
theft
crime
police investigation
India news

More Telugu News