R Ashwin: ఆ కుర్రాడిపై ఒత్తిడి వద్దు.. కానీ కచ్చితంగా ఇండియాకు ఆడతాడు: వైభవ్‌పై అశ్విన్
ఐపీఎల్ 2026లో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల యువ కెరటం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే, ఇంత చిన్న వయసులోనే అతడిపై అంచనాలు పెంచి, టీమిండియాలోకి తీసుకురావాలంటూ తొందరపడొద్దని కీలక సూచన చేశాడు. నిన్న గువాహటిలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడానికి వైభవ్ ఆటే కారణమైంది.
ఈ మ్యాచ్‌లో తొలుత చెన్నైని 127 పరుగులకే కట్టడి చేసిన రాజస్థాన్, ఛేదనలో వైభవ్ సూర్యవంశీ మెరుపులతో ఆధిపత్యం చెలాయించింది. కేవలం 17 బంతుల్లో 52 పరుగులు చేసిన వైభవ్, అందులో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఐపీఎల్ చరిత్రలోనే మూడో వేగవంతమైన అర్ధశతకాన్ని నమోదు చేశాడు. అతని ధాటికి రాజస్థాన్ పవర్‌ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షం చేసింది.
ఈ ప్రదర్శనపై తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన అశ్విన్, వైభవ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "అతడికి అలాంటి లక్ష్యాలు నిర్దేశించకండి. అతను ఇంకా కుర్రాడు కాదు, ఒక పిల్లాడు. ఎంఎస్ ధోనీ 44 ఏళ్ల వరకు ఆడితే, సూర్యవంశీ 40 ఏళ్ల వరకు ఆడినా.. అతనికి ఇంకా రెండున్నర దశాబ్దాల క్రికెట్ భవిష్యత్తు ఉంది. అతడిని ప్రశాంతంగా వదిలేయండి. సరైన సమయంలో తనే పైకొస్తాడు. టీమిండియాకు ఆడలేనంత స్థాయి ఆటగాడు కాదు. కచ్చితంగా ఏదో ఒక రోజు ఆడతాడు. ఎప్పుడు ఆడతాడనే దాని కోసం మనం కాస్త ఆగాలి. మనకెందుకంత తొందర?" అని అశ్విన్ ప్రశ్నించాడు.
వైభవ్ బ్యాటింగ్ తీరును అశ్విన్ ఆకాశానికెత్తాడు. "అతనికి 15 ఏళ్లు నిండాయి. అందుకే 15 బంతుల్లో 50 కొట్టాడు. తన వయసును చూపిస్తున్నాడు. అతను ఎంత అద్భుతమైన ఆటగాడు? అతని బ్యాట్ స్పీడ్ ఎంత వేగంగా ఉంది? అతని దెబ్బకు చెన్నై బౌలర్ల వద్ద సమాధానమే లేదు. ఫీల్డ్‌లో సీఎస్‌కే పూర్తిగా డీలాపడిపోయింది. ఈ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ 'మమ్మల్ని చూడండి, ఈ టోర్నీలో మేం కూడా బలమైన జట్టే' అని చాటి చెప్పింది" అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
వైభవ్ ఔటైన తర్వాత యశస్వి జైస్వాల్ (38 నాటౌట్), కెప్టెన్ రియాన్ పరాగ్ (14 నాటౌట్) మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు. మరో 47 బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ విజయాన్ని అందుకుని ఈ ఐపీఎల్ సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది.