ఏపీకి రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి తెచ్చారు: పయ్యావుల కేశవ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీకి రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి తెచ్చారు: పయ్యావుల కేశవ్

Payyavula Keshav Criticizes YCP for AP Capital Situation
  • మూడు రాజధానుల నాటకంతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారన్న పయ్యావుల
  • రాష్ట్రాన్ని జగన్ కేవలం రాజకీయ కోణంలోనే చూశారని విమర్శ
  • సమాజానికి వైసీపీ హానికరమని వ్యాఖ్య

గత ప్రభుత్వం మూడు రాజధానుల నాటకంతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ రాష్ట్రాన్ని కేవలం రాజకీయ కోణంలోనే చూశారని, ఐదేళ్ల పాలనలో ఒక్క పెట్టుబడి కూడా సాధించలేకపోయారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితికి రాష్ట్రాన్ని తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 


అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని, అటువంటి రాజధానికి ఇప్పుడు శాశ్వత చట్టబద్ధ రక్షణ కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. సమాజానికి వైసీపీ హానికరమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని కొనియాడారు. ఇప్పటికైనా జగన్ తన వైఖరి మార్చుకోవాలని పయ్యావుల హితవు పలికారు. ఈరోజు సభలో జరిగిన చర్చ మొత్తాన్ని జగన్ చూడాలని... అప్పుడైనా ఆయన మారతారేమో చూడాలని అన్నారు.


Advertisement
Payyavula Keshav
Andhra Pradesh
AP Capital
Jagan Mohan Reddy
Amaravati
YS Jagan
Chandrababu Naidu
TDP
AP Politics

More Telugu News