Kasu Mahesh Reddy: పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ క్రెడిట్ కొట్టేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: కాసు మహేశ్

Kasu Mahesh Reddy Slams Government Over Medical College Credit
షార్ట్స్‌లో చూడండి

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ మెడికల్ కాలేజీ పనులు 60 శాతం వరకు పూర్తయ్యాయని, జగన్ చొరవతోనే పల్నాడుకు ఈ ప్రాజెక్టు వచ్చిందని ఆయన అన్నారు. 


స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు ఈ కాలేజీపై కనీస అవగాహన లేదని, వైసీపీ తెచ్చిన ప్రాజెక్టును తమదేనని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఒకవేళ ఎమ్మెల్యేకి అంత చిత్తశుద్ధి ఉంటే, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి చూపించాలని సవాల్ విసిరారు.

Go Back to Shorts
Kasu Mahesh Reddy
Puduguralla Medical College
YCP
Yarapathineni Srinivasa Rao
Palnadu
Andhra Pradesh Politics
Medical College Project
YS Jagan
Andhra Pradesh Government
Telugu News

More Telugu News