KCR: రంజాన్ వేళ చిన్ననాటి స్నేహితుడ్ని కలిసిన కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు రంజాన్ సందర్భంగా చిన్ననాటి స్నేహితుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహమ్మద్ జహంగీర్ ను, ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో ఈ భేటీ జరిగింది. కేసీఆర్తో వారు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు కేసీఆర్కు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ను కలిసిన వారిలో బీఆర్ఎస్ రాష్ట్రనేత జుబేర్ మహమ్మద్ కూడా ఉన్నారు.
కేసీఆర్ కూడా వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీలో వారు కేసీఆర్కు సంప్రదాయ ఇస్లాం టోపీని బహూకరించగా, ఆయన దానిని ధరించారు. కాసేపు వారితో కలిసి పండుగ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సమావేశం పూర్తిగా వ్యక్తిగతంగా, పండుగ వాతావరణంలో స్నేహపూర్వకంగా సాగింది.