ఆస్తి పన్ను చెల్లించేవారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆస్తి పన్ను చెల్లించేవారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

AP Government Announces Good News for Property Tax Payers
  • పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్
  • ఈ నెల 31వ తేదీ లోపు బకాయిలు చెల్లించేవారికి వడ్డీ మొత్తంలో 50 శాతం రాయితీ
  • ఇప్పటికే వడ్డీ సహా పన్ను చెల్లించిన వారికి కూడా శుభవార్త
  • ఇలాంటి వారికి వడ్డీ రాయితీ మొత్తాన్ని తదుపరి ఆర్థిక సంవత్సరం బిల్లులో సర్దుబాటు

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఒక మంచి ఊరటనిచ్చింది. పెండింగ్‌లో ఉన్న బకాయిల వల్ల పెరుగుతున్న వడ్డీ భారాన్ని తగ్గించేలా మున్సిపల్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే తమ ఆస్తి పన్ను బకాయిలను ఈ నెల 31వ తేదీ లోపు ఒకేసారి చెల్లిస్తారో, వారికి వడ్డీ మొత్తంలో 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ అధికారికంగా జీవో నెం.58ని విడుదల చేశారు. 


అయితే, ఇప్పటికే వడ్డీ సహా పన్ను చెల్లించిన వారు తాము నష్టపోయామని ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం మరో వెసులుబాటు కూడా కల్పించింది. అటువంటి వారు పొందే రాయితీ మొత్తాన్ని తదుపరి ఆర్థిక సంవత్సరం పన్ను బిల్లులో సర్దుబాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు సమయం దగ్గరపడుతుండటంతో, బకాయిల వసూళ్లను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Advertisement
AP Government
Andhra Pradesh
Property Tax
Municipal Department
Suresh Kumar
Property Tax Dues
Interest Waiver
G.O. 58
Municipal Administration
Tax Payment

More Telugu News