Sree Vishnu: అంచనాలు పెంచుతున్న 'మృత్యుంజయ్'
- రేపు విడుదలవుతున్న 'మృత్యుంజయ్'
- శ్రీవిష్ణుతో మరోసారి జోడీకట్టిన రెబా మోనికా జాన్
- సస్పెన్స్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్
- సంగీతాన్ని సమకూర్చిన కాలభైరవ
'మృత్యుంజయ్' .. అంటే మృత్యువును జయించినవాడు అని అర్థం. టైటిల్ పరంగా చూసుకుంటే ఇది చాలా కుతూహలాన్ని రేకెత్తించేదే అని చెప్పాలి. అలాంటి టైటిల్ తో ఇప్పుడు ప్రేక్షకులను పలకరించడానికి శ్రీవిష్ణు రెడీ అవుతున్నాడు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, రేపు థియేటర్లకు రానుంది. సందీప్ గుణ్ణం - వినయ్ చిలకపాటి నిర్మించిన ఈ సినిమాలో, శ్రీవిష్ణుకి జోడీగా రెబా మోనికా జాన్ కనిపించనుంది.
శ్రీ విష్ణు - రెబా మోనికా జాన్ కలిసి చేసిన రెండో సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'సామజవరగమన' సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత రెబా మోనికా జాన్ ఒకటి రెండు తెలుగు సినిమాలలో అతిథి పాత్రలలో మెరిసింది అంతే. తమిళ .. మలయాళ సినిమాలతో మాత్రం బిజీగానే ఉంది. ఇక ఈ మధ్యనే కన్నడ సినిమాలను లైన్లో పెడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె శ్రీవిష్ణుతో కలిసి ఈ సినిమా చేసింది.
సస్పెన్స్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఒక పాప చుట్టూ కథ తిరుగుతుందని అంటున్నారు. ఆసక్తికరమైన కథాకథనాలతో .. అనూహ్యమైన మలుపులతో ఈ సినిమా కొనసాగుతుందని అంటున్నారు. కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం హైలైట్ గా నిలిచిందని చెబుతున్నారు. ఈ సినిమాతో శ్రీవిష్ణు - రెబా జోడీకి మరో హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.