నీ జీవితంలో నీ భార్యతో కలిసి తిరుమలకు రాలేవు.. ఎందుకంటే!: జగన్‌పై బీఆర్ నాయుడు ఫైర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నీ జీవితంలో నీ భార్యతో కలిసి తిరుమలకు రాలేవు.. ఎందుకంటే!: జగన్‌పై బీఆర్ నాయుడు ఫైర్

BR Naidu Questions Jagans Faith and Tirumala Visits
  • హిందుత్వం గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదన్న బీఆర్ నాయుడు
  • అన్యమతస్తుల తొలగింపు నిర్ణయంతోనే తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపణ
  • జగన్ భార్యతో కలిసి తిరుమలకు వస్తేనే జనం నమ్ముతారని స్పష్టీకరణ
వైసీపీ అధినేత జగన్ పై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆయన జగన్‌ను ప్రశ్నిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందుత్వం గురించి గానీ, శ్రీవారి గురించి గానీ మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇది జగమెరిగిన సత్యం అంటూ ఈ మేరకు ట్వీట్ చేశారు.

"హిందుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. దేవదేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గురించి నువ్వు మాట్లాడతావా జగన్..? ఆయన పేరు ఉచ్ఛరించే అర్హత, నైతికత నీకుందా? హిందూ వ్యతిరేకి అయిన నువ్వు సీఎంగా ఉన్నావనే కదా నీ అనుచరులకి ధైర్యం..! అందుకే వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి రెచ్చిపోయి హిందూ మత ఔన్నత్యాన్ని మంటగలిపారు. ఒక పథకం ప్రకారం తిరుమల కొండపై యథేచ్ఛగా అన్యమత ప్రచారం చేశారు. 

అన్యమతస్తుడవైన నువ్వు ఇప్పటివరకు దేవదేవునిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు? సీఎంగా ఉండగా నీ భార్యతో కలిసి గుడికి వచ్చి పట్టు వస్త్రాలిచ్చావా?... రాలేదే! నీ జీవితంలో నీ భార్యతో కలిసి తిరుమలకు రాలేవు.. ఎందుకంటే మీ ఇద్దరూ నమ్మేది ఏసుప్రభువునే కానీ, శ్రీ వేంకటేశ్వర స్వామిని కాదు కాబట్టి... ఇది ఒప్పుకో జగన్! 

నేను ఛైర్మన్ అయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు టీటీడీని ప్రక్షాళన చేస్తున్నాం. నీ అండతో నీ బాబాయ్, భూమన చేసిన అవినీతి, అక్రమాలు బయట పడుతున్నాయనే నీ బాధంతా! టీటీడీలో అన్యమతస్తులు ఉండరాదని నేను నిర్ణయం తీసుకున్న నాడే నాపై పథకం ప్రకారం కుట్రలు ప్రారంభించావు. అందులో భాగంగానే కదా నాపై డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి తిరుమల ప్రతిష్ఠ దెబ్బతీయాలని చూశావు. 

శ్రీ వేంకటేశ్వర స్వామిని ఇంటిదైవంగా పూజించే చంద్రబాబుకు దేవదేవునిపై భక్తి లేదంటావా?చంద్రబాబు భార్యతో తిరుమలకు వస్తారు. నువ్వు హిందువువే అయితే భార్యతో తిరుమలకు రా...! అప్పుడు నిన్ను నమ్ముతారు. కానీ నువ్వు సతీసమేతంగా రాలేవు... నిన్ను ఎవ్వరూ నమ్మరు జగన్!" అంటూ బీఆర్ నాయుడు నిప్పులు చెరిగారు. 
Advertisement
BR Naidu
Jagan
TTD
Tirumala
Hinduism
Chandrababu Naidu
YS Jagan
Tirupati
Andhra Pradesh Politics
TTD Chairman

More Telugu News