అల్లు శిరీష్‌ను పెళ్లికొడుకును చేసే కార్యక్రమం... ప్రత్యేక ఆకర్షణగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అల్లు శిరీష్‌ను పెళ్లికొడుకును చేసే కార్యక్రమం... ప్రత్యేక ఆకర్షణగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

Allu Sirish Wedding Celebrations Begin Vijay Devarakonda and Rashmika Attend
  • అట్టహాసంగా మొదలైన అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు
  • పెళ్లికొడుకు ఫంక్షన్‌లో పాల్గొన్న కొత్త జంట రష్మిక-విజయ్
  • హాజరైన అల్లు అర్జున్, రామ్ చరణ్ 
  • మార్చి 6న కుటుంబ సభ్యుల సమక్షంలో శిరీష్ వివాహం
టాలీవుడ్ యువ హీరో, అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. తన ప్రేయసి నయనికా రెడ్డితో మార్చి 6న శిరీష్ ఏడడుగులు వేయనున్నాడు. ఈ క్రమంలో అల్లు వారింట పెళ్లి సందడి ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం అల్లు శిరీష్‌ను పెళ్లికొడుకును చేసే వేడుక అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను శిరీష్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

ఈ వేడుకలో ఇటీవల వివాహం చేసుకున్న కొత్త జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరూ నూతన వరుడిని ఆశీర్వదించి సందడి చేశారు. అలాగే అల్లు అర్జున్-స్నేహ రెడ్డి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు, నందమూరి బాలకృష్ణ అర్ధాంగి వసుంధర కూడా హాజరై కాబోయే వరుడికి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందే శిరీష్ నివాసంలో పసుపు దంచే కార్యక్రమంతో పెళ్లి పనులు సాంప్రదాయబద్ధంగా మొదలయ్యాయి.

మార్చి 6న కేవలం కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో ఈ వివాహం జరగనుంది. అయితే, సినీ పరిశ్రమ ప్రముఖుల కోసం మార్చి 2న (రేపు) అల్లు స్టూడియోస్‌లో భారీ ప్రీ-వెడ్డింగ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు శిరీష్ స్వయంగా వెల్లడించారు. "నయనిక నేను మార్చి 6న పెళ్లి చేసుకుంటున్నాం. కానీ మార్చి 2న ఇండస్ట్రీ మిత్రుల కోసం గ్రాండ్‌గా ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ జరుపుకుంటున్నాం" అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో ఒక్కటైన రష్మిక-విజయ్ జంట మార్చి 4న హైదరాబాద్‌లో తమ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.
Advertisement
Allu Sirish
Allu Arjun
Naynika Reddy
Vijay Devarakonda
Rashmika Mandanna
Ram Charan
Telugu Wedding
Tollywood
Celebrity Wedding
Hyderabad

More Telugu News