నూతన దంపతులకు కానుక... 'రణబాలి'లోని 'ఎందయ్య సామి' పాట విడుదల

Vijay Deverakonda Ranabali Movie Endayya Saami Song Released
టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు వారి కొత్త సినిమా టీమ్ నుంచి ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ అందింది. ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంటకు కానుకగా, వారు నటిస్తున్న 'రణబాలి' చిత్రం నుంచి ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. "ఎందయ్య సామి" అంటూ సాగే ఈ పాటను శనివారం రిలీజ్ చేశారు.

రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో విజయ్ 'రణబాలి' అనే పవర్‌ఫుల్ పాత్రలో, రష్మిక 'జయమ్మ'గా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన "ఎందయ్య సామి" పాటకు ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ స్వరాలు సమకూర్చారు. ఈ పాటలో విజయ్, రష్మికల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని, వారిద్దరినీ చూస్తుంటే 'గీత గోవిందం' రోజులు గుర్తుకొస్తున్నాయని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మెలోడీని తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో 'ది మమ్మీ' ఫేమ్, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఒక కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

Go Back to Shorts
Ranabaali
Vijay Deverakonda
Rashmika Mandanna
Endayya Saami Song
Telugu Movie
New Song Release
Mythri Movie Makers
Rahul Sankrityan
Arnold Vosloo
Tollywood

More Telugu News