హైదరాబాద్ లోని హనుమాన్ ఆలయంపై నమాజ్ చేసిన వ్యక్తి అరెస్ట్

Man Arrested for Namaz At Hyderabad Hanuman Temple
  • ప్రతాపసింగారంలో ఆలయంపై నమాజ్ చేసిన ఉన్మాది
  • పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు
  • కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిన మేడిపల్లి పోలీసులు

మల్కాజ్ గికి కమిషనరేట్ పరిధిలోని ప్రతాపసింగారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రశాంతంగా ఉండే అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఒక వికృత ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయ ఆవరణలోని హనుమాన్ మందిరం పైకి ఎక్కి, ఒక గుర్తు తెలియని వ్యక్తి నమాజ్ చేస్తూ కనిపించడంతో... స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు.


ఈ ఘటనపై ప్రతాపసింగారం నివాసి బద్దం కుమార్ ఫిర్యాదు చేయడంతో, మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ఈ ఉదంతం వల్ల మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీస్ యంత్రాంగం తక్షణమే రంగంలోకి దిగింది. ప్రతాపసింగారంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఉద్రిక్త పరిస్థితులు, అల్లర్లు జరగకుండా అయ్యప్ప దేవాలయం, పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. దేవాలయం వద్ద భారీ పోలీస్ పికెటింగ్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది.

Go Back to Shorts
Hanuman Temple
Hyderabad
Pratap Singaram
Namaz
Arrest
Medipally Police
Ayyappa Temple
Religious Tension

More Telugu News