కరెంట్ కష్టాలకు వాట్సాప్‌లో చెక్.. టీజీఎస్పీడీసీఎల్ కొత్త సేవలు

TGSPDCL Launches WhatsApp Chatbot for Electricity Services
షార్ట్స్‌లో చూడండి
వేసవిలో విద్యుత్ సమస్యలకు సులభంగా చెక్ పెట్టేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TGSPDCL) వినియోగదారులకు ఒక శుభవార్త అందించింది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వాట్సాప్‌ చాట్‌బాట్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలను పొందడానికి వినియోగదారులు తమ ఫోన్‌లో `87124 41912` నంబర్‌ను సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో 'హాయ్' అని సందేశం పంపితే సరిపోతుంది.

ఈ చాట్‌బాట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయడం, వాటి ప్రస్తుత స్థితిని తెలుసుకోవడం, కరెంట్ బిల్లు వివరాలు, విద్యుత్ సరఫరా సమాచారం వంటి అనేక సేవలను సులభంగా పొందవచ్చు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) టెక్నాలజీతో ఈ చాట్‌బాట్‌ను రూపొందించామని, దీనివల్ల వినియోగదారులకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందుతాయని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ తెలిపారు.

ఇటీవల కాలంలో కరెంట్ బిల్లుల పేరుతో సైబర్ మోసాలు పెరిగాయని ఆయన గుర్తుచేశారు. "మీ బిల్లు పెండింగ్‌లో ఉంది, వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తాం" అంటూ వచ్చే బెదిరింపు కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అలాంటి కాల్స్ చేస్తే ఆందోళన చెందకుండా, వెంటనే ఈ వాట్సాప్ చాట్‌బాట్‌ ద్వారా తమ అసలు బిల్లు వివరాలు సరిచూసుకోవాలని ఆయన వివరించారు. ప్రతి వినియోగదారుడు ఈ నంబర్‌ను సేవ్ చేసుకోవడం ద్వారా మోసాల బారిన పడకుండా తమను తాము కాపాడుకోవచ్చని ఫరూఖీ సూచించారు.
Go Back to Shorts
TGSPDCL
Telangana electricity
electricity bill
TS discom
Musarraf Faruqui
cyber fraud
WhatsApp chatbot
power supply
electricity complaints
AI chatbot

More Telugu News