Raghurama Krishna Raju: వైఎస్ భారతికి లీగల్ నోటీసులు పంపిన రఘురామకృష్ణరాజు

Raghurama Krishna Raju Sends Notice to Sakshi Media
  • తన గౌరవానికి భంగం కలిగించేలా సాక్షిలో కథనాలు రాస్తున్నారన్న రఘురామ
  • వైఎస్ భారతితో పాటు బోర్డు డైరెక్టర్లు, ఎడిటర్, బ్యూరో చీఫ్ లకు నోటీసులు
  • తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్
సాక్షి మీడియాకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు పంపించారు. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఆయన నోటీసులు పంపారు. ఇందిరా టెలివిజన్ ఎండీ వైఎస్ భారతి, బోర్డు డైరెక్టర్లు, ఎడిటర్, బ్యూరో చీఫ్ లకు రఘురామ తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర ఈరోజు నోటీసులు పంపించారు.

తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు తక్షణమే బేషరతుగా తనకు క్షమాపణ చెప్పాలని నోటీసులో రఘురామ డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అంతేకాదు, నష్టపరిహారంగా తనకు కోటి రూపాయలు ఇవ్వాలని... ఆ మొత్తాన్ని అమరావతి రైతులకు అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రఘురామ నోటీసులకు వైఎస్ భారతి, ఇతరులు ఎలా స్పందింస్తారో వేచిచూడాలి.
Raghurama Krishna Raju
Sakshi Media
YS Bharathi
AP Assembly
Legal Notice
Defamation
Amaravati Farmers
Andhra Pradesh Politics

More Telugu News