జర్మనీలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయుల సజీవ దహనం
- జర్మనీలోని బోచుమ్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం
- ఘటనలో ముగ్గురు భారతీయులు మృతి
- మృతుల్లో ఇద్దరు యువతులు, ఒక యువకుడు
- ఐదుగురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
- హత్య అనుమానంతో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
జర్మనీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. బోచుమ్ నగరంలోని ఓ నివాస భవనంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలో మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటనపై హత్య అనుమానంతో పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. బోచుమ్లోని హోఫ్స్టెడ్ జిల్లాలో ఉన్న ఓ నివాస భవనంలో మంగళవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ఓ అపార్ట్మెంట్లో ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. మృతులను 25, 27 ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులుగా, 26 ఏళ్ల యువకుడిగా గుర్తించారు. వీరంతా భారతీయులని అధికారులు నిర్ధారించారు.
ఈ ప్రమాదంలో పొగ పీల్చడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన మరో ఐదుగురిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే గాయపడిన వారి జాతీయతకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణ అనంతరం అదే భవనంలో నివసించే 41 ఏళ్ల రొమేనియా దేశస్థుడిని హత్య అనుమానంతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.