Allu Sirish: అల్లు శిరీశ్ పెళ్లి సందడి ప్రారంభం... ఘనంగా పసుపు దంచుడు కార్యక్రమం.. వీడియో ఇదిగో

Allu Sirish Wedding Festivities Begin With Pasupu Danchudu
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ హీరో, అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీశ్ పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. నయనికతో అల్లు శిరీశ్ పెళ్లి మార్చి 6న జరగనుంది. గత నెల దుబాయ్‌లో ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిపారు. ఇప్పుడు హైదరాబాద్‌ లోని అల్లు అరవింద్ ఇంట్లో నిన్న సంప్రదాయబద్ధంగా పసుపు దంచుకునే కార్యక్రమం జరిగింది.

సాధారణంగా హల్దీ పేరుతో ఈ ఫంక్షన్లను జరుపుకుంటుంటారు. కానీ, హల్దీ ఫంక్షన్ కు 'నో' చెప్పి... ఇంట్లోనే సంప్రదాయ పద్ధతిలో పసుపు దంచుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ వేడుకలో పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా, బన్నీ భార్య స్నేహ, చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత, ఇతర బంధువులు, పిల్లలు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఈ కార్యక్రమం వీడియోను శిరీశ్ పోస్ట్ చేశాడు. ఫ్యామిలీ ఫంక్షన్ సరదాగా, సంతోషంగా సాగింది. పెళ్లి వేడుకలు ఇక మరింత జోరుగా సాగనున్నాయి.

Go Back to Shorts
Allu Sirish
Allu Arjun
Allu Aravind
Nayanika
Telugu Cinema
Tollywood Wedding
Pasupu Danchudu
Anna Lezhnova
Sneha Reddy
Susmita Konidela

More Telugu News