Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' అప్డేట్స్ పై హరీశ్ శంకర్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan Ustaad Bhagat Singh Updates Harish Shankar Key Comments
షార్ట్స్‌లో చూడండి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – క్రేజీ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబో అంటే టాలీవుడ్‌లో అత్యంత ఎక్స్‌పెక్టేషన్ కలిగిన కాంబినేషన్లలో ఒకటి. ‘గబ్బర్ సింగ్’తో ఈ కాంబో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో మళ్లీ ప్రభంజనం సృష్టించేందుకు వీరు రెడీ అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 26న ఈ సినిమా విడుదల కాబోతోంది.


మరోవైపు, చాలా కాలంగా సినిమా గురించి అప్డేట్ రావడం లేదన్న నిరాశతో ఉన్న పవన్ అభిమానులు సోషల్ మీడియాలో హరీశ్ శంకర్‌ను ట్యాగ్ చేసి ప్రశ్నలు గుప్పిస్తున్నారు. వందల సంఖ్యలో వస్తున్న పోస్టులపై హరీశ్ శంకర్ తాజాగా స్పందించారు. అభిమానుల ఆత్రుతను తాను పూర్తిగా అర్థం చేసుకుంటున్నానని, కానీ ప్రతి అప్డేట్ కు సరైన సమయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. “మమ్మల్ని నమ్మండి... సెలబ్రేషన్స్ లోడింగ్... త్వరలోనే అన్ని అప్‌డేట్స్ ఇస్తాం. సినిమా నిర్మాణం వెనుక ఎంతో కష్టం ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి అప్‌డేట్‌ను మీరు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు” అని పోస్ట్ చేశారు.

Go Back to Shorts
Pawan Kalyan
Ustaad Bhagat Singh
Harish Shankar
Sreeleela
Raashi Khanna
Mythri Movie Makers
Devi Sri Prasad
Gabbar Singh
Telugu Cinema
Tollywood

More Telugu News