జగన్ పై స్వామి శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ పై స్వామి శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు

Srinivasananda Saraswati Demands Apology from Jagan on Laddu Issue
  • జగన్ హయాంలో నాణ్యత లేని లడ్డూలు తయారు చేశారన్న శ్రీనివాసానంద సరస్వతి
  • లడ్డూని కల్తీ చేయడం దారుణమని వ్యాఖ్య
  • జగన్ అండ్ కో క్షమాపణ చెప్పాలని డిమాండ్
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూని కల్తీ చేశారని ఆరోపించారు. జగన్ హయాంలో నాణ్యత లేని లడ్డూలు తయారు చేశారని... ఇది అన్యమతస్తుల కుట్ర అని మండిపడ్డారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూని కల్తీ చేయడం దారుణమని అన్నారు. 

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని తొలుత కూటమి నేతలు మాట్లాడినప్పుడు తాము పట్టించుకోలేదని... కానీ, ఇప్పుడు లడ్డూ కల్తీ జరిగిందని సీబీఐ రిపోర్ట్ ఇచ్చిందని, ఈ రిపోర్టుతో తాము భయాందోళనకు గురయ్యామని చెప్పారు. లవ్ జిహాద్ మాదిరి లడ్డూ జిహాద్ జరిగిందనే అనుమానం తమకు ఉందని అన్నారు. 

రసాయనాలు కలిసిన లడ్డూ తిని భక్తులు అనారోగ్యంపాలయ్యే అవకాశం ఉందని చెప్పారు. సీబీఐ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు. రెండు కొండలు అన్న వైఎస్ రాజశేఖరరెడ్డికి ఎలాంటి శిక్ష పడిందో అందరూ చూశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లడ్డూ కల్తీపై నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే జగన్ అండ్ కో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  
Advertisement
Srinivasananda Saraswati
YS Jagan
Tirumala laddu
Laddu adulteration
Andhra Pradesh sadhu parishad
CBI report
YSR
Tirupati
Laddu Jihad
AP Politics

More Telugu News