Deepali Dahikamble: గురువుపై శిష్యుల మమకారం.. టీచర్ కోసం రోజూ పండ్లు తెస్తున్న పిల్లలు!

Teacher Deepali Dahikamble surprised by students fruit gifts
  • టీచర్ మాటపై పిల్లల ప్రేమాభిమానం
  • రోజూ కిటికీ గుండా పండ్ల సరఫరా
  • నెట్టింట వైరలైన ఇన్ స్టాగ్రామ్ వీడియో
  • పిల్లల నిష్కల్మష ప్రేమకు నెటిజన్ల ఫిదా
బెంగళూరులో 'టీచ్ ఫర్ ఇండియా' ఫెలోగా పనిచేస్తున్న దీపాలి దహికాంబ్లే అనే ఉపాధ్యాయురాలికి తన విద్యార్థులు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆమెకు పండ్లు అంటే ఇష్టమని సరదాగా చెప్పిన మాటను విద్యార్థులు ఎంత సీరియస్‌గా తీసుకున్నారో తెలిస్తే ఎవరైనా ముచ్చటపడాల్సిందే.

ఒకరోజు క్లాసులో మాట్లాడుతూ తనకు పండ్లు తినడం చాలా ఇష్టమని దీపాలి తన విద్యార్థులతో చెప్పారు. అంతే, మరుసటి రోజు నుంచి పిల్లలందరూ తాము వచ్చేటప్పుడు ఒక్కో పండును తీసుకురావడం మొదలుపెట్టారు. స్టాఫ్ రూమ్ కిటికీ దగ్గరికి వచ్చి, తమ చిన్నారి చేతులతో ఆ పండ్లను టీచర్‌కు అందించడం ఇప్పుడు ఒక రోజూవారీ అలవాటుగా మారిపోయింది.

దీపాలి ఈ అద్భుతమైన క్షణాలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియోకు ఇప్పటివరకు 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎటువంటి స్వార్థం లేని ఈ చిన్నారుల ప్రేమాభిమానాలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. "నిజమైన విద్య అంటే మార్కులు రావడం మాత్రమే కాదు, ఇలాంటి మానవత్వపు విలువలను పెంపొందించడమే" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 
Deepali Dahikamble
Teach for India
Bangalore teacher
Students love
Teacher appreciation
Fruits gift
Viral video
Kindness
Student teacher relationship
Education values

More Telugu News