డబ్ల్యూపీఎల్ : ముంబై ఇండియన్స్ తో మ్యాచ్.. నిలకడగా యూపీ వారియర్స్ బ్యాటింగ్
- మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై, యూపీ మధ్య పోరు
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
- తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయిన యూపీ వారియర్స్
- దూకుడుగా ఆడుతూ ఆకట్టుకుంటున్న కెప్టెన్ మెగ్ లానింగ్
- 5 ఓవర్లకు యూపీ స్కోరు 42/1
బ్యాటింగ్‌కు దిగిన యూపీకి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్ కిరణ్ నవగిరే (0) ఒక్క బంతి మాత్రమే ఆడి నికోలా క్యారీ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగింది. దీంతో 5 పరుగులకే యూపీ తొలి వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఎండ్‌లో కెప్టెన్ మెగ్ లానింగ్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తోంది. ఆమెకు ఫోబ్ లిచ్‌ఫీల్డ్ తోడవడంతో పవర్‌ప్లేలో యూపీ మంచి స్కోరు సాధించింది.
ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసే సమయానికి యూపీ వారియర్స్ వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ 21 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 28 పరుగులు చేయగా, లిచ్‌ఫీల్డ్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.