Suniel Shetty: ఆ యాడ్ లో నటిస్తే రూ.40 కోట్లు... సునీల్ శెట్టి ఎందుకు వదులుకున్నాడంటే...!
- పొగాకు ఉత్పత్తుల ప్రకటనకు రూ.40 కోట్లు ఆఫర్ చేశారన్న సునీల్ శెెట్టి
- తన పిల్లలకు ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ ప్రకటనను రిజక్ట్ చేశానని వెల్లడి
- అలాంటి ప్రకటనల్లో నటిస్తే తన పిల్లలకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందన్న సునీల్
కొంత మంది నటులు ఒక్క సినిమాతో ఎంత పారితోషికం అందుకుంటారో, అదే స్థాయిలో వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా సంపాదిస్తుంటారు. అయితే, ప్రకటనల ఎంపిక విషయంలో కొందరు నటులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. హానికర ఉత్పత్తులను ప్రోత్సహించే ప్రకటనలు వస్తే నిర్మొహమాటంగా తిరస్కరించే వారిలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి ఒకరు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ, పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ఓ ప్రకటన తన వద్దకు వచ్చిందని, దానికి రూ.40 కోట్ల వరకు పారితోషికం ఆఫర్ చేశారని వెల్లడించారు. అయినప్పటికీ, ఆ యాడ్‌ను తాను తిరస్కరించానని చెప్పారు. తన పిల్లలు అహాన్, అతియాకు తాను ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ ప్రకటనను రిజక్ట్ చేసినట్లు తెలిపారు. తాను అలాంటి ప్రకటనల్లో నటిస్తే తన పిల్లలకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందన్న ఆలోచన తన నిర్ణయానికి కారణమని పేర్కొన్నారు.