దేశంలోనే 7వ ఉత్తమ పోలీస్ స్టేషన్గా శామీర్పేట పీఎస్
- ప్రతి సంవత్సరం 10 ఉత్తమ పోలీస్ స్టేషన్ల ఎంపిక
- మొదటి పది పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసిన హోంశాఖ
- అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా ఘాజీపూర్ ల్యాండ్ఫీల్ పీఎస్
దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల పనితీరు, రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వక ప్రవర్తన, ఫిర్యాదుల సత్వర పరిష్కారం, పోలీస్ స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, పచ్చదనం, సిబ్బంది పనితీరు వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర హోంశాఖ ర్యాంకులు కేటాయిస్తుంది.