హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు సీరియస్ .. హాజరుకాకుంటే వారెంట్
- బతుకమ్మకుంట భూవివాదంలో కోర్టుకు హాజరుకానందుకు కమిషనర్ రంగనాథ్‌పై ఆగ్రహం
- డిసెంబర్ 5 లోపు విచారణకు రావాలని ఆదేశం
- హాజరుకాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామన్న హైకోర్టు
పూర్తి వివరాల్లోకి వెళితే.. బతుకమ్మకుంటలోని ఒక ప్రైవేట్ స్థలంలో ఎలాంటి మార్పులు చేయవద్దని ఈ ఏడాది జూన్ 12న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆ ఆదేశాలను ఉల్లంఘించారని ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, ఏవీ రంగనాథ్‌ను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.
గురువారం ఈ కేసు మరోసారి విచారణకు రాగా, ఏవీ రంగనాథ్ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నిర్దేశించిన గడువులోగా విచారణకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది.