మరో బస్సు ప్రమాదం.. ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్సు బోల్తా
- ఏలూరు జిల్లా లింగంపాలెం సమీపంలో బోల్తా పడిన బస్సు
- ఇద్దరు మృతి, 13 మందికి గాయాలు
- క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలింపు
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.