Chiranjeevi: మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి
- దయా చౌదరి అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చిరంజీవి
- తన పేరు, ఫొటో, వాయిస్‌ను అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారని చిరంజీవి ఫిర్యాదు
- కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారని పోలీసులకు తెలిపిన చిరంజీవి
ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవి సామాజిక మాధ్యమాల్లో తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా అభ్యంతరకర పోస్టులు పెడుతున్న దయాచౌదరి అనే వ్యక్తిపై చిరంజీవి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన పేరు, ఫోటో, వాయిస్‌ను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని ఇటీవల ఆయన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు చిరంజీవికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తనకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, కొంతమంది ఉల్లంఘనలు ఆపకపోవడంతో ఆయన మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కొన్ని వెబ్‌సైట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ రెండు రోజుల క్రితం చిరంజీవి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను ఉపయోగించి, తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలను సృష్టిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.