నాగార్జున సినిమాలో మరో హీరోయిన్ ఫిక్స్!
- తెరకెక్కనున్న నాాగార్జున 100వ చిత్రం
- ఇప్పటికే టబును ఖరారు చేసినట్టు సమాచారం
- మరో హీరోయిన్ కోసం అనుష్కతో చర్చలు
ఈ సినిమా పూర్తిస్థాయి పొలిటికల్ డ్రామాగా ఉండబోతోందని, ముఖ్యమంత్రి పదవి చుట్టూ కథనం సాగుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయనున్నారని కూడా అంటున్నారు. ప్రధాన హీరోయిన్ పాత్ర కోసం మొదట నయనతారను సంప్రదించినా, చివరికి టబును ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పుడు మరో కీలకమైన పాత్ర కోసం అనుష్క శెట్టితో చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే, చాలా కాలం తర్వాత నాగార్జున, టబు, అనుష్కలను ఒకే సినిమాలో చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కుతుంది.
ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రంలో నాగార్జున కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా ప్రత్యేక అతిథి పాత్రల్లో కనిపించనున్నారని చెబుతున్నారు. ఒకే సినిమాలో అక్కినేని కుటుంబానికి చెందిన ముగ్గురు హీరోలు కనిపిస్తే అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఈ వార్తలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.