వివేకా హత్య కేసు... సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
- వైఎస్ వివేకా హత్య కేసు విచారణ మరోసారి వాయిదా
- విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా
- అఫిడవిట్ దాఖలుకు సమయం కోరిన దర్యాప్తు సంస్థ సీబీఐ
వివేకా హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై తమ వాదనలు వినిపించేందుకు సిద్ధం కావాల్సి ఉందని సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు విన్నవించారు. అఫిడవిట్ దాఖలు చేసేందుకు కొంత గడువు కావాలని ఆయన అభ్యర్థించారు.
సీబీఐ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, అందుకు అంగీకారం తెలుపుతూ విచారణను వాయిదా వేసింది. ఈ నెల 16న జరిగే విచారణలో సీబీఐ దాఖలు చేయబోయే అఫిడవిట్ కీలకం కానుంది.