ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
- తెలంగాణ, ఏపీలలోని పలు జిల్లాల్లో వర్షాలు
- వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
వాయవ్య బంగాళాఖాతంలో రానున్న 12 గంటల నుంచి 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.