ఏపీలో గణేశ్ శోభాయాత్రలో విషాదం.. నలుగురి మృతి
- నరసాపురం మండలం తూర్పుతాళ్ల గ్రామంలో ఘటన
- గణేశ్ శోభాయాత్రలో ట్రాక్టర్ అదుపుతప్పి భక్తులపై దూసుకువెళ్లిన వైనం
- క్షతగాత్రులు నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
క్షతగాత్రులను నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను తూర్పుతాళ్ల గ్రామానికి చెందిన సూర్యనారాయణ (52), మురళి (33), నరసింహమూర్తి (32), దినేశ్ (10)గా గుర్తించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.