Amit Shah: అమిత్ షా విమానంలో సాంకేతిక లోపం.. తన ఫ్లైట్ ఇచ్చిన ఏక్‌నాథ్ షిండే!
- ముంబై నుంచి గుజరాత్ కు వెళ్లే సమయంలో విమానంలో సాంకేతిక సమస్య
- వెంటనే స్పందించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే
- షిండే విమానంలో కుటుంబంతో కలిసి గుజరాత్ కు పయనమైన అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబై పర్యటనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రెండు రోజుల ముంబై పర్యటన ముగించుకుని తిరిగి గుజరాత్‌కు బయలుదేరే సమయంలో ఆయన ప్రయాణించాల్సిన విమానంలో ఆకస్మికంగా సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయం తెలిసిన వెంటనే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించి, తన విమానాన్ని దేశ హోంమంత్రి వినియోగానికి అందించారు. దీంతో అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి షిండే విమానంలో గుజరాత్‌కు బయలుదేరి వెళ్లారు.
నిన్న రాత్రి ముంబై చేరుకున్న అమిత్ షా, తన పర్యటనలో భాగంగా పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి అతుల్ లిమాయే, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర చవాన్‌లతో ఆయన చర్చలు జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసానికి వెళ్లి, అక్కడ ఏర్పాటు చేసిన గణేశ్ ఉత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కుటుంబ సమేతంగా ప్రఖ్యాత లాల్‌బాగ్చా రాజా గణపతిని దర్శించుకున్నారు.
ఈ పర్యటన సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో అమిత్ షాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వీరి మధ్య... రాబోయే ఉపరాష్ట్రపతి, బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్టీ సంస్థాగత విషయాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అదేవిధంగా, రాష్ట్రంలో కొనసాగుతున్న మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం గురించి ముఖ్యమంత్రి ఫడ్నవీస్, మంత్రి ఆశిష్ షెలార్‌ల నుంచి అమిత్ షా వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది.