రాష్ట్ర ఎన్నికల సంఘంపై అవినాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
- వేడి పుట్టిస్తున్న పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక
- బూత్ ల మార్పుతో ఎన్నికల సంఘం కుట్రకు తెరలేపిందన్న అవినాశ్ రెడ్డి
- దీని వెనుక టీడీపీ కుట్ర ఉందని మండిపాటు
మరోవైపు, రాష్ట్ర ఎన్నికల సంఘంపై వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పోలింగ్ కు ముందు బూత్ ల మార్పుతో ఎన్నికల సంఘం కుట్రకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల మార్పు వెనుక టీడీపీ కుట్ర ఉందని మండిపడ్డారు. ఏ ఊరి వాళ్లు ఆ ఊళ్లోనే ఓటు వేసేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఉప ఎన్నికను పారదర్శకంగా నిర్వహించే దమ్ము ప్రభుత్వానికి, ఈసీకి ఉందా? అని ఆయన ప్రశ్నించారు.