డోంట్ కేర్ ట్రంప్... భారత పర్యటనకు వస్తున్న పుతిన్!
- రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారంటూ భారత్ పై ట్రంప్ సుంకాలు
- ట్రంప్ ను పట్టించుకోని భారత్, రష్యా
- ఈ నెలాఖరున భారత్ లో పర్యటించనున్న పుతిన్!
పుతిన్ భారత పర్యటన తేదీలు ఖరారు కానప్పటికీ... ఈ నెలాఖరు ఆయన భారత పర్యటన ఉండొచ్చని 'ఇంటర్ ఫ్యాక్స్ న్యూస్ ఏజెన్సీ' తెలిపింది. భారత్ పై మరో 25 శాతం సుంకాలు పెంచుతూ నిన్ననే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు. ఇది జరిగిన ఒక్క రోజు వ్యవధిలోనే భారత పర్యటకు పుతిన్ వస్తున్నారనే వార్త అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.