ఆలయానికి బయల్దేరి కారు ప్రమాదంలో నలుగురు వృద్ధులు దుర్మరణం
- అమెరికాలో విషాదం.. భారత సంతతి సీనియర్ సిటిజన్లు మృతి
- తొలుత మిస్సింగ్ కేసు నమోదు.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
- కారు ప్రమాదంలో నలుగురూ మరణించారని ప్రకటన
మధ్యలో ఓ రెస్టారెంట్ వద్ద ఆగి లంచ్ చేశారని, ఆ తర్వాత వారి జాడ తెలియరాలేదని పేర్కొన్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే వృద్ధులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని, కారులోని నలుగురూ అక్కడికక్కడే చనిపోయారని గుర్తించారు. ప్రాథమిక పరిశీలనలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.