మాలేగావ్ పేలుళ్ల కేసు తీర్పుపై అసదుద్దీన్ రియాక్షన్ ఇదే!
- నిందితులంతా నిర్దోషులే అయితే.. ఆ ఆరుగురిని ఎవరు చంపినట్టు?..
- కోర్టు తీర్పు అసంతృప్తి కలిగించిందన్న ఎంఐఎం ఎంపీ
- ఈ తీర్పుపై ఫడ్నవీస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తుందా అని ప్రశ్న
ముంబై సబర్బన్ రైలు పేలుళ్ల తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గుర్తుచేశారు. ఆ కేసులోనూ ఆధారాలు స్పష్టంగా లేవనే కారణంతో నిందితులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిందని చెప్పారు. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారన్నారు. ఆ కేసు తరహాలోనే మాలేగావ్ పేలుళ్ల కేసు తీర్పుపైనా ఫడ్నవీస్, మోదీ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాయా? అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.