ఆపరేషన్ సిందూర్‌లో మేడిన్ ఇండియా ఆయుధాలు సత్తా చాటాయి: ప్రధాని మోదీ
- నిన్న తమిళనాడులో పర్యటించిన ప్రధాని మోదీ
- పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని
- భారత్‌లో తయారైన ఆయుధాలు ఉగ్రవాదుల గూళ్లను నేలమట్టం చేయడంలో కీలక పాత్ర పోషించాయన్న మోదీ
ఇటీవల 'ఆపరేషన్ సిందూర్'లో మేక్ ఇన్ ఇండియా శక్తిని ప్రజలు ప్రత్యక్షంగా చూశారని ఆయన అన్నారు. భారత్‌లో తయారైన ఆయుధాలు ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేయడంలో కీలక పాత్ర పోషించాయని వివరించారు. ఇప్పటికీ భారత్‌లో తయారైన ఆయుధాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే నాయకులను రాత్రంతా నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.