పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న కేటీఆర్... భద్రతా సిబ్బందిని వారించిన పాడి కౌశిక్ రెడ్డి!
- ఉప్పల్‌లో తెలంగాణ విద్యార్థి విభాగం సదస్సుకు హాజరైన కేటీఆర్
- తన ముందు నడుస్తున్న కార్యకర్తను చేయితో నెట్టిన కేటీఆర్
- నాయకులు, సెక్యూరిటీ చేయి చేసుకుంటే వారించిన కౌశిక్ రెడ్డి
అయితే, అక్కడ ఏం జరిగిందో స్పష్టంగా తెలియదు కానీ, కేటీఆర్ తన ముందున్న కార్యకర్త తలపై చేయితో పక్కకు నెట్టేశారు. ఆ తర్వాత పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా అతడిని పక్కకు లాగారు. కౌశిక్ రెడ్డి, ఇతర నాయకులు అతడిని అక్కడి నుంచి దూరంగా పంపించే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది అతడిని నెట్టివేస్తుండగా కౌశిక్ రెడ్డి వారించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.