హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానంలో మంటలు
- పవర్ యూనిట్‌లో చెలరేగిన మంటలు
- ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు ఎయిరిండియా వెల్లడి
- విమానం స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిపిన ఎయిరిండియా
హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన విమానం ల్యాండ్ అయిన కాసేపటికి పవర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయని ఎయిరిండియా తెలిపింది. ఈ ఘటనలో విమానానికి స్వల్ప నష్టం వాటిల్లిందని పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా దిగారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించింది. తదుపరి విచారణ కోసం విమానాన్ని నిలిపివేసినట్లు ఎయిరిండియా తెలిపింది.