ఐఏఎస్ ఆమ్రపాలికి క్యాట్‌లో ఊరట.. ఏపీ నుంచి మళ్లీ తెలంగాణకు కేటాయింపు
- తిరిగి తెలంగాణ రాష్ట్రానికే కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు
- నాలుగు నెలల క్రితం డీఓపీటీ ఉత్తర్వులతో ఏపీకి బదిలీ
- తనను తెలంగాణకే కేటాయించాలని క్యాట్‌లో పిటిషన్
- ఆమ్రపాలి విజ్ఞప్తికి అనుకూలంగా క్యాట్ తీర్పు
కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆమ్రపాలి దాదాపు నాలుగు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లారు. అయితే, దీనిని సవాల్ చేస్తూ, తనను తెలంగాణకు కేటాయించాలని కోరుతూ క్యాట్‌ను ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన క్యాట్, ఇరుపక్షాల వాదనలు విన్నది. అనంతరం, ఆమ్రపాలి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటూ ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.