సాయంత్రంలోగా చంపేస్తామంటూ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్!
- మావోయిస్టులమంటూ ఆగంతుకుడి బెదిరింపు
- మధ్యప్రదేశ్ నుంచి కాల్ చేస్తున్నట్లు తెలిపిన వ్యక్తి
- దమ్మాయిగూడలో కార్యక్రమంలో ఉండగా ఫోన్
- డీజీపీ, ఎస్పీలకు రఘునందన్ రావు ఫిర్యాదు
రఘునందన్ రావు సోమవారం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ఒక పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయనకు బెదిరింపు కాల్ వచ్చింది. మధ్యప్రదేశ్ నుంచి ఫోన్ చేస్తున్నానని, మావోయిస్టునని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, రఘునందన్ రావును సాయంత్రంలోగా చంపేస్తామని బెదిరించాడు.