స్నేహం పేరుతో బాలికను బెదిరించి నగ్న వీడియో చిత్రీకరించిన బాలుడు
- ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలో ఘటన
- సోషల్ మీడియాలో పరిచయమైన బాలిక
- ఇద్దరి మధ్య చాటింగ్‌ను ఆమె తల్లిదండ్రులకు చూపిస్తానని బెదిరించిన బాలుడు
- నగ్న వీడియోను స్నేహితులకు షేర్ చేసిన నిందితుడు
- ఇద్దరు బాలురు సహా 8 మంది అరెస్ట్
పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడికి సోషల్ మీడియా ద్వారా బాధిత బాలిక పరిచయమైంది. ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్‌ను ఉపయోగించుకున్న బాలుడు.. దానిని ఆమె తల్లిదండ్రులకు చూపించకుండా ఉండాలంటే నగ్నంగా వీడియో కాల్ చేయాలని బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక అలాగే చేసింది. ఆ వీడియోను రికార్డు చేసిన బాలుడు దానిని తన స్నేహితులకు షేర్ చేశాడు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు స్పందించారు. బాలికను మానసికంగా, శారీరకంగా వేధించిన ఇద్దరు మైనర్లతో పాటు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఇద్దరు బాలురను నిజామాబాద్‌లోని జువైనల్ హోంకు, మిగిలిన వారిని రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.