మానసిక ప్రశాంతతకు యోగా కీలకం: నారా బ్రాహ్మణి
- విశాఖలో ఏపీ ప్రభుత్వ 'యోగాంధ్ర' కార్యక్రమం
- పాల్గొన్న మంత్రి నారా లోకేశ్ అర్ధాంగి బ్రాహ్మణి
- యోగా ప్రాముఖ్యతను మోదీ విశ్వవ్యాప్తం చేశారన్న బ్రాహ్మణి
కార్యక్రమం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ యోగా విశిష్టతను వివరించారు. మానసిక ప్రశాంతతను పొందడానికి యోగా ఒక అద్భుతమైన మార్గమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ నిరంతర కృషితోనే యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, అనేక దేశాల ప్రజలు దీనిని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుంటున్నారని బ్రాహ్మణి ప్రశంసించారు. కాగా, విశాఖ సాగర తీరంలో జరిగిన ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.