'యోగాంధ్ర'తో ప్రపంచం ఏపీ వైపు చూస్తోంది... కూటమి నేతలను అభినందించిన మోదీ
- రేపు (జూన్ 21) విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం
- విశాఖ చేరుకున్న ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికిన చంద్రబాబు, పవన్, లోకేశ్
- ఏపీ నేతల సమష్టి కృషి ప్రశంసనీయమన్న ప్రధాని మోదీ
అంతకుముందు, యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తదితరులు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి ప్రధాని నేరుగా ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని, అక్కడి నుంచి నౌకాదళ అతిథిగృహానికి వెళ్లారు. ఈ రాత్రి ఆయన అక్కడే బస చేస్తారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్డులో నిర్వహించే భారీ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని యోగాసనాలు వేయనున్నారు. కార్యక్రమాలు ముగిసిన అనంతరం, ఉదయం 11:50 గంటలకు ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖ నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.


