గతంలో కంటే ఇప్పుడే నేను బాగున్నా: సమంత
- గత రెండేళ్లుగా తన సినిమాలు విడుదల కాలేదన్న సమంత
- ఈ విరామ సమయంలో వ్యక్తిగతంగా ఎంతో సాధించానని వెల్లడి
- కీర్తి ప్రతిష్టల కంటే స్వేచ్ఛాయుత జీవితమే నిజమైన విజయమని వ్యాఖ్య
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, "కీర్తి ప్రతిష్టలకు అతీతంగా, స్వేచ్ఛగా జీవితాన్ని గడపడమే నిజమైన విజయమని నేను భావిస్తున్నాను. గత రెండేళ్లుగా నేను నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ విరామంలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, వ్యక్తిగతంగా ఎంతో సాధించాను. జీవితంలో ఒకే వృత్తానికి పరిమితం కాకుండా స్వేచ్ఛగా వృద్ధిలోకి రావడం, పరిణితి సాధించడం అన్నింటికంటే ముఖ్యం" అని వివరించారు.
తనకు రెండేళ్లుగా విజయాలు లేవని చాలా మంది అనుకోవచ్చని, కానీ గతంలో కంటే ఇప్పుడు తాను మెరుగ్గా ఉన్నానని సమంత పేర్కొన్నారు. "ప్రతి రోజూ ఉత్సాహంగా నిద్రలేస్తున్నాను. నా జీవితాశయం దిశగా స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడే నేను ఉన్నతమైన విజయాలను ఆస్వాదిస్తున్నాను" అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సమంత స్వీయ నిర్మాణంలో 'మా ఇంటి బంగారం' అనే చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు, హిందీలో 'రక్త్ బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్‌లో కూడా కనిపించనున్నారు.