ప్రపంచ సుందరి పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా ఎలిమినేట్
- హైదరాబాద్ హైటెక్స్‌లో మిస్ వరల్డ్ 2025 పోటీల జోరు
- టాప్-8 నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా అవుట్
- టాప్-8లో ఎనిమిది దేశాల సుందరీమణులు
- ఖండాల వారీగా ఒక్కొక్కరిని ఎంపిక చేసిన నిర్వాహకులు
ఈ పోటీల్లో భాగంగా ప్రకటించిన టాప్-8 జాబితాలో నందిని గుప్తా స్థానం దక్కించుకోలేకపోయారు. టాప్-8లో నిలిచిన సుందరీమణులలో మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలెండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ దేశాలకు చెందిన వారు ఉన్నారు.
ఆ తర్వాత ఖండాల వారీగా టాప్ ఇద్దరి నుంచి ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేశారు. అమెరికా అండ్ కరీబియన్: మార్టినిక్, ఆఫ్రికా: ఇథియోపియా, యూరప్: పోలెండ్, ఆసియా: థాయ్‌లాండ్ సుందరీమణులు ఉన్నారు. ఖండాల వారీగా ఎంపికైన టాప్ నలుగురు కంటెస్టెంట్లను న్యాయనిర్ణేతలు ప్రశ్నలు అడుగుతున్నారు.