'పాకిస్థాన్ రత్న'... సిద్ధరామయ్యపై బీజేపీ ఫైర్

Siddaramaiah Called Pakistan Ratna by BJP
పాకిస్థాన్ తో యుద్ధం వద్దంటూ సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు
మండిపడుతున్న బీజేపీ నేతలు
సిద్ధరామయ్య పాకిస్థాన్ లో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయారంటూ ఆర్. అశోక ఎద్దేదేవా
పాకిస్థాన్‌తో యుద్ధం వద్దంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. తాను పాకిస్థాన్‌తో యుద్ధానికి అనుకూలం కాదంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్.అశోక స్పందిస్తూ... సిద్ధరామయ్యను 'పాకిస్థాన్ రత్న'గా అభివర్ణించారు. "మీ అవివేకపు, అర్థరహిత వ్యాఖ్యలతో మీరు రాత్రికి రాత్రే పాకిస్థాన్‌లో ఫేమస్ అయిపోయారు" అని ఎద్దేవా చేశారు.

సిద్ధరామయ్య వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచి కూడా భిన్న స్వరాలు వినిపించాయి. కాంగ్రెస్ నేత హెచ్‌ఆర్ శ్రీనాథ్ మాట్లాడుతూ, "ఇది సిద్ధరామయ్య వ్యక్తిగత ప్రకటన, కాంగ్రెస్ పార్టీ వైఖరి కాదు. ఇలాంటి వ్యక్తిగత ప్రకటనలు చేయాలనుకుంటే, పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి చేయవచ్చు. పాక్ కు వ్యతిరేకంగా దేశమంతా ఏకతాటిపై నిలవాలని రాహుల్ గాంధీ తదితరులు పిలుపునిచ్చారు. దాన్ని పాటించకుండా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు" అని అన్నారు. 

ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రం సీఎం వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించారు. "ఉగ్రదాడిపై కాంగ్రెస్ పార్టీ ఒక వైఖరి తీసుకుంది. సీఎం ఏమన్నారో నేను వ్యాఖ్యానించదలచుకోలేదు. మీరే ఆయన్ను అడగాలి" అని తెలివిగా బదులిచ్చారు.
Go Back to Shorts
Siddaramaiah
Pakistan
BJP
Karnataka
India-Pakistan War
Congress
R Ashok
DK Shivakumar
HR Srinath
Controversial Remarks

More Telugu News