నైట్ రైడర్స్ తో పంజాబ్ కింగ్స్ ఢీ... టాస్ అప్ డేట్ ఇదిగో!

Punjab Kings vs Kolkata Knight Riders Toss Update and Match Preview
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ లో ఇవాళ పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ఢీకొంటున్నాయి. కోల్ కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం పంజాబ్ జట్టులోకి మ్యాక్స్ వెల్, ఒమర్జాయ్ తిరిగొచ్చారు. అటు, కేకేఆర్ టీమ్ లో మొయిన్ ఖాన్ స్థానంలో రోవ్ మాన్ పావెల్... రమణ్ దీప్ స్థానంలో చేతన్ సకారియా తుదిజట్టుకు ఎంపికయ్యారు. 

పాయింట్ల పట్టిక చూస్తే... పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్ ల్లో 5 విజయాలతో ఐదో స్థానంలో ఉంది. కోల్ కతా నైట్ రైడర్స్ 8 మ్యాచ్ ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
Go Back to Shorts
Punjab Kings
Kolkata Knight Riders
IPL 2023
Cricket Match
Eden Gardens
Maxwell
Oman
Rowman Powell
Chetan Sakariya
Toss Update

More Telugu News