తిరుమల గోశాలను పరిశీలించిన సీపీఐ నారాయణ
- గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం లేదన్న నారాయణ
- ఆవులన్నీ పుష్టిగా ఉన్నాయని వ్యాఖ్య
- గోశాలను వైసీపీ రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదని విమర్శ
టీటీడీ గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదని సీపీఐ నారాయణ అన్నారు. ప్రతినిత్యం గోవులను వైద్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గోవులకు కావాల్సినంత దాణా ఉందని... ఆవులన్నీ పుష్టిగా ఉన్నాయని తెలిపారు. గోశాలను వైసీపీ రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. టీటీడీ గౌరవం తగ్గేలా మాట్లాడవద్దని సూచించారు.
గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని... ఆయనను సస్పెండ్ చేయడం కాదు, విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో గోవులకు పురుగుల దాణా పెట్టారని మండిపడ్డారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి హరినాథరెడ్డి కమీషన్లు తీసుకునేవారని ఆరోపించారు.