విడదల రజనిపై ఫిర్యాదు చేసిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు
- రజని అక్రమాలను ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారన్న రావు సుబ్రహ్మణ్యం
- తన కారుని, ఇంట్లో ఫర్నిచర్ ని ధ్వంసం చేశారని ఆవేదన
- తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరిన సుబ్రహ్మణ్యం
మరోవైపు, తాజాగా విడదల రజని, ఆమె మరిది విడదల గోపిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందింది. చిలకలూరిపేటకి చెందిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వీరిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2022 ఏప్రిల్ లో రజని అక్రమాలను ప్రశ్నించినందుకు తన ఇంటిపై దాడి చేయించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. దాదాపు వంద మంది వచ్చి తనపై దాడి చేశారని... తన కారుని, ఇంట్లో ఫర్నిచర్ ని ధ్వంసం చేశారని తెలిపారు. మూడు రోజుల పాటు విధ్వంసం సృష్టించారని... తనను, తన కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని... నామమాత్రంగా కేసు నమోదు చేశారని తెలిపారు. రజని, గోపి పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చి తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు.