ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు... దివ్యాంగుల విషయంలో హెచ్‌సీఏ కీలక నిర్ణయం
- దివ్యాంగులకు ఉచితంగా ఐపీఎల్ పాస్‌లు జారీ చేస్తామన్న హెచ్‌సీఏ
- టికెట్లు కావాల్సిన వారు పూర్తి వివరాలతో మెయిల్ పంపాలని సూచన
- దరఖాస్తులను పరిశీలించి ప్రాధాన్యత ఆధారంగా పాస్‌లు జారీ చేస్తామని వెల్లడి
ఈ టికెట్లు కావాల్సిన వారు పూర్తి వివరాలను (పేరు, కాంటాక్ట్ నంబర్, వ్యాలిడ్ డిజబులిటీ ప్రూఫ్, ఏ మ్యాచ్ కోసం పాస్ కావాలి) [email protected] మెయిల్‌కు పంపడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని హెచ్‌సీఏ వెల్లడించింది. సీట్లు పరిమితంగా ఉంటాయి కనుక మొదట వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రాధాన్యత ఆధారంగా పాస్‌లు జారీ చేస్తామని తెలిపింది.
కాగా, ఈరోజు లక్నోతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తలపడనున్న విషయం తెలిసిందే. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.