శ్రీరెడ్డికి హైకోర్టులో ఊరట.. షరతులతో కూడిన బెయిలు మంజూరు
- చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితలపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు
- రాష్ట్రవ్యాప్తంగా ఆరు కేసుల నమోదు
- విశాఖపట్నంలో నమోదైన కేసులో బెయిలు
- వారానికోసారి దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశం
- చిత్తూరు కేసులో బెయిలు పిటిషన్ కొట్టివేత
కాగా, అనకాపల్లిలో నమోదైన కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) సాయిరోహిత్ వాదనలు వినిపిస్తూ.. సోషల్ మీడియా పోస్టుల్లో శ్రీరెడ్డి అత్యంత అభ్యంతరకరమైన భాష వాడినట్టు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వాదనల అనంతరం న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి విచారణను వారం పాటు వాయిదా వేశారు. అలాగే, కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లోని కేసులకు సంబంధించి శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.